News December 12, 2025

ఎన్టీఆర్ జిల్లాలో నవోదయ పరీక్షకు సర్వం సిద్ధం

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) కోసం ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,349 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 13న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు కేటాయించిన కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు.

Similar News

News March 4, 2026

VZM: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

image

జిల్లాలో జరుగుతున్న రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో అమరావతి నుంచి బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రీసర్వే ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, గడువులోగా రీసర్వేతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

News March 4, 2026

ఆ 5 గ్రామాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

image

సూర్యఘర్ పథకం ద్వారా బాపట్ల జిల్లాలో ఐదు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. బాపట్ల కలెక్టరేట్‌లో CPDCL అధికారులతో 24,620 గృహాలకు సౌర విద్యుత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. పిట్టలవానిపాలెం, కొత్తపేట, కారంచేడు, కనగాల, యడ్లపల్లి గ్రామాల్లో 100% సౌరయూనిట్లు ఏర్పాటుచేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కేంద్ర పథకాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

News March 4, 2026

ఏపీ జేఏసీ జిల్లా జాయింట్ సెక్రటరీగా సీహెచ్ చలం ఎన్నిక

image

ఏపీ జేఏసీ పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. చలం ఎన్నికయ్యారు. భీమవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చలం మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.