News December 12, 2025
మక్తల్: పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా మక్తల్ నియోజకవర్గానికి చెందిన మక్తల్, కృష్ణ, నర్వ, ఉట్కూరు, మగనూరు మండలాల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 244 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మిగిలిన వారు ఎంపీడీవో కార్యాలయాల్లో శనివారం సాయంత్రం 5 లోపు ఓటు వినియోగించుకోవాలని చెప్పారు.
Similar News
News March 28, 2026
IPL ప్రసారాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం ఎత్తివేత

బంగ్లాదేశ్‌లో IPL ప్రసారంపై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపాన్ ప్రకటించారు. ముస్తాఫిజుర్‌ను తొలగించారన్న కారణంతో యూనస్ ప్రభుత్వం IPLను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ లేదా వేరే ఏ ఛానల్ ప్రసారం చేసినా అనుమతిస్తామని జహీర్ తెలిపారు. బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు.
News March 28, 2026
సెయింట్ జోసెఫ్‌లో ‘జీరో వేస్ట్’ అవగాహన సదస్సు

కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం ‘జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొడి, తడి, పారిశుధ్య వ్యర్థాల విభజన విధానంపై వారు విద్యార్థులకు వివరించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా పారిశుధ్యంపై అవగాహన కల్పించారు.
News March 28, 2026
వికారాబాద్: నెమ్మదిగా HPV టీకా వ్యాక్సినేషన్!

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల HPC టీకాను బాలికలకు ఉచితంగా అందిస్తుంది. జిల్లాలో వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుంది. జిల్లా వ్యాప్తంగా పదివేల మందికి టీకాను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం 300 మంది వరకు మాత్రమే టీకాను వేసినట్లు అధికారులు చెబుతున్నారు. టీకాపై మరింత అవగాహన పెంచి ప్రతి ఒక్కరు టీకాను తీసుకునేలా అధికారులు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.


