News December 12, 2025

పీలేరు హైవేపై ఘోర ప్రమాదం.. మహిళ దుర్మరణం

image

పీలేరు మండలం వేపుల బైలు పంచాయతీ వద్ద కొత్తగా వేసిన హైవేపై జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మదనపల్లి నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు రోడ్డు దాటుతున్న వనజ (40)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వనజను కారు డ్రైవర్ సెల్వం, బంధువులతో కలిసి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పీలేరు ఎస్ఐ లోకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 17, 2026

రాత్రికి రాత్రి అనుమతి లేదంటున్నారు: తలసాని

image

TG: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం ర్యాలీ చేస్తామని తాము ఎప్పుడో దరఖాస్తు చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘నిన్న ఓకే చెప్పి రాత్రికి రాత్రే అనుమతి లేదని పోలీసులు చెప్పారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లేమో ఇష్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారు. కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని ర్యాలీ చేస్తాం’ అని ఆయన చెప్పారు.

News January 17, 2026

అధైర్యపడొద్దు.. కార్యకర్తలకు రాజ్ ఠాక్రే పిలుపు

image

ముంబై మున్సిపల్ ఎన్నికల <<18877157>>ఫలితాల<<>> నేపథ్యంలో MNS అధినేత రాజ్‌ ఠాక్రే తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘మనం అపారమైన డబ్బు, అధికార బలంతో తలపడ్డాం. ఆశించిన ఫలితం రాకపోయినా అధైర్యపడొద్దు’ అని భరోసానిచ్చారు. మరాఠీ భాష, అస్తిత్వం కోసం పోరాడటమే మన ఊపిరి అని, గెలిచిన వారు ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. లోపాలను సరిదిద్దుకుని మళ్లీ అధికారంలోకి వద్దామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

News January 17, 2026

ADB: ఆదర్శ పాఠశాల అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

image

ఉమ్మడి ADB జిల్లాలో 14 మోడల్ పాఠశాలలో 2026- 27 సం.రానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms .telangana.gov.inలో సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.