News December 12, 2025
పొందూరు ఖాదీకి GI ట్యాగ్ గుర్తింపు

పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక GI ట్యాగ్ లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు X వేదికగా ప్రకటించారు. ఇది శ్రీకాకుళం నేతకార్మికుల వారసత్వానికి లభించిన అపూర్వ గౌరవమని తెలిపారు. గాంధీజీకి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్ర ఉందని, ఎన్నో కష్టాల మధ్య ఈ కళను కాపాడిన నేతకార్మికులే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. GI ట్యాగ్‌తో ఖాదీ మార్కెట్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 20, 2026
భారత్‌లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 నిర్వహణకు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈవెంట్ నిర్వహించేందుకు భారత్, న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. మౌలిక వసతుల పరిశీలన అనంతరం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి వచ్చింది. దీంతో ఆసియాలో జపాన్, ఖతర్, చైనా తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 పోలాండ్ వేదికగా నేడు ప్రారంభం కానుంది.
News March 20, 2026
తగ్గనున్న డయాబెటిస్ మందుల ధరలు!

డయాబెటిస్, ఒబెసిటీ మందుల ధరలు తగ్గనున్నాయి. వీటి చికిత్సలో కీలకమైన సెమాగ్లుటైడ్(ఒజెంపిక్, వెగోవి) పేటెంట్ నేటితో ముగియనుంది. దీంతో ఈ మెడిసిన్‌ను పేటెంట్‌తో పని లేకుండా ప్రభుత్వ అనుమతితో తయారు చేసి విక్రయించేందుకు వీలు దొరకనుంది. దీంతో ధరలు 50-70% తగ్గే అవకాశం ఉంది. తద్వారా ఏటా ₹60 వేలు-70 వేలు ఆదా కానుంది. టైప్-2 డయాబెటిస్ రోగులలో షుగర్ నియంత్రణకు ఒజెంపిక్, ఒబెసిటీ చికిత్సలో వెగోవిని వాడతారు.
News March 20, 2026
నేడు తిరుమలకు చంద్రబాబు, లోకేశ్

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకోనున్నారు. మంత్రి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి రేణిగుంట, అక్కడి నుంచి తిరుమలకు చేరుకోనున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో తిరుపతి చేరుకొని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు.


