News December 12, 2025

జనగామ: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి!

image

2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 641 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. దీంతో పరీక్షను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 12, 2026

కామారెడ్డి: 2కే రన్ ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రీడాభారతి ఆధ్వర్యంలో 2కే రన్‌ను అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. యువజన ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. వివేకానందున్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలో ముందుకు పోవాలని సూచించారు. యువకులు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.

News January 12, 2026

18 ఏళ్లు నిండిన విద్యార్థులు లెర్నర్స్ లైసెన్స్‌ పొందండి: DTO

image

సంక్రాంతి సెలవులకు వస్తున్న విద్యార్థులు లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు ఇదే మంచి అవకాశమని DTO దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఆధార్ అడ్రస్ ఆధారంగా ‘parivahan.saradhi.gov.in’ వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. సంబంధిత ఆర్‌టీఓ కార్యాలయానికి హాజరై, పరీక్ష రాసి లైసెన్స్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 12, 2026

కొనసాగుతున్న రూపాయి పతనం

image

ఈ వారం మార్కెట్‌ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.