News December 13, 2025

సిద్దిపేట: ఎన్నికల విధులకు హాజరుకాని 182 మంది సస్పెండ్

image

ఈనెల 11న సిద్దిపేట జిల్లాలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల విధులకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. హైమావతి తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ముందస్తుగానే కలెక్టర్ హెచ్చరించినప్పటికీ విధులకు గైర్హాజరు కావడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News December 13, 2025

వాటిని పెద్దగా పట్టించుకోను: వైభవ్ సూర్యవంశీ

image

2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుడిగా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ నిలిచారు. ఈ క్రమంలో పాపులారిటీలో కోహ్లీని కూడా దాటేశారన్న వార్తలపై వైభవ్ స్పందించారు. ‘వీటిని పెద్దగా పట్టించుకోను. నా దృష్టి ఆటపైనే. ఇలాంటి వార్తలు విన్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. వాటిని చూసి ఆనందపడతాను. తర్వాత పనిలో పడిపోతా’ అని చెప్పారు. UAEతో మ్యాచ్‌లో వైభవ్ 171(95) పరుగులతో <<18542043>>విధ్వంసం<<>> సృష్టించారు.

News December 13, 2025

తంగళ్ళపల్లి: 700 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.

News December 13, 2025

హెచ్పీవీని జాతీయ టీకాల జాబితాలో చేర్చాలి: విశాఖ సీపీ

image

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్‌ను జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైతన్య స్రవంతి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు, హోంగార్డుల కుమార్తెలకు (9-14 ఏళ్లు) ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు త్వరలో బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.