News December 13, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు

చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువులు, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 2నెలల కాలంలో జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు చెప్పారు. రాబోయే 21 రోజులకు 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. 2,117 టన్నులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 8, 2026
చిత్తూరు: వైసీపీలో పలువురికి పదవులు

జిల్లాకు చెందిన పలువురిని వైసీపీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫక్రుద్దీన్(పుంగనూరు) మైనారిటీ సెల్ జోన్ 5 వర్కింగ్ ప్రెసిడెంట్, రవీంద్రనాథ్ రెడ్డి(చిత్తూరు) రాష్ట్ర లీగల్ జనరల్ సెక్రెటరీ, లీగల్ సెల్ అధికార ప్రతినిధులుగా రవీంద్ర(నగరి) సుగుణ శేఖర్ రెడ్డి(చిత్తూర్), జిల్లా ఉద్యోగులు, పింఛన్ వింగ్ అధ్యక్షుడిగా సోమచంద్రారెడ్డి(పలమనేరు)ను నియమించారు.
News January 7, 2026
క్రీడా పరికరాలు అందించిన చిత్తూరు కలెక్టర్

చిత్తూరు వికలాంగుల క్రీడా సంఘం సభ్యులు రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను బుధవారం కలిశారు. మరిన్ని విజయాలు సాధించేందుకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు. వారి వినతి మేరకు.. షటిల్ బ్యాట్స్ 6, షూస్ 10 జతలు, జావెలిన్ 2, షాట్ పుట్ 2, షటిల్ కాక్ బాక్సులు రెండు వారికి కలెక్టర్ అందించారు. వారిని అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
News January 7, 2026
దొంగలపై 181 కేసులు.. చిత్తూరులో చిక్కారు.!

చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన <<18789584>>దొంగల<<>> వివరాలు.. గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య (49), పల్నాడు జిల్లా నారాయణపురానికి చెందిన నాగుల్ మీరా(27), గుంటూరు జిల్లా సంగడి గుంటకు చెందిన తులసి రామిరెడ్డి (27)ని పోలీసులు అరెస్టు చేశారు. వెంకయ్యపై 100 కేసులు, నాగుల్ మీరాపై 75 కేసులు, తులసి రామిరెడ్డి పై ఆరు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.


