News December 13, 2025
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

2వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 6మండలాల్లో పరిధిలో ఉన్న 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డులకు నామినేషన్లు స్వీకరించామని చెప్పారు. ఓ వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదని, 23 గ్రామపంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారన్నారు. మిగిలిన 160 GPలకు మొత్తం 451మంది, 1,379వార్డులకు 3,352మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు.
Similar News
News April 8, 2026
కలెక్టరేట్‌లో సైరన్, సీసీ కెమెరాలపై కలెక్టర్ ఆరా

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోడౌన్ సీళ్లను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును స్వయంగా తనిఖీ చేసిన ఆయన, భద్రతా సిబ్బంది విధుల్లో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. అత్యవసర సైరన్ పనితీరును కూడా ఆయన పరీక్షించారు.
News April 8, 2026
ఖమ్మం కార్పొరేషన్‌లో అవినీతి జలగలు

3 లక్షల జనాభా ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. IAS అధికారి అభిషేక్ కమిషనర్‌గా ఉన్నప్పటికి పాలనపై పట్టు లేకపోవడంతో రెవిన్యూ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కొందరు అధికారులు, సిబ్బంది.. కాంట్రాక్టర్లతో కలిసి అడ్డగోలుగా సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాలకవర్గం పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో KMCపై కలెక్టర్ దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
News April 8, 2026
ఖమ్మం: 11న ఫూలే జయంతిలో పాల్గొనండి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 11న నిర్వహించే జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి పూలమాలలు అర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సంఘాల నాయకులు పాల్గొనాలని సూచించారు.


