News April 20, 2024

చల్లబడిన వాతావరణం

image

TG: రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వాతావరణంలో మార్పుల వల్ల హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఇక వీకెండ్ కావడం, మరో మూడ్రోజుల పాటు వెదర్ చల్లగానే ఉంటుందని వాతావరణశాఖ చెప్పడంతో నగర ప్రజలు టూర్లు, షాపింగ్ వంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News November 19, 2024

దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు: భట్టి

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.

News November 19, 2024

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: పవన్

image

AP: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 15వ ఫైనాన్స్ నిధులు కేటాయించామని చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం మా బాధ్యత. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తాం. ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News November 19, 2024

కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్

image

ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.