News December 13, 2025

22 ఏళ్లకే ఉపసర్పంచ్‌గా ఎన్నిక.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ప్రజాసేవకు!

image

శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామ యువతి బండారి రిషిత (22) అరుదైన ఘనత సాధించారు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించిన ఆమె, గ్రామాభివృద్ధి ధ్యేయంగా కొలువును వదిలారు. ఈమె మంచి మనసును గుర్తించిన గ్రామస్తులు రిషితను తొలి విడత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. యువతకు రిషిత ఆదర్శంగా నిలిచారు.

Similar News

News January 3, 2026

కేసీఆర్ వదిలిన రాజకీయ బాణం కవిత: కోమటిరెడ్డి

image

మాజీ సీఎం కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలను దూరం చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కవిత అసలు బీఆర్‌ఎస్‌లో ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై విమర్శలకే స్పందిస్తున్న ఆమె.. హరీశ్‌రావుపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మంత్రి ప్రశ్నించారు.

News January 3, 2026

NLG: టీచర్లకు పరీక్ష.. విద్యార్థులకు బోధన ఎలా?

image

జిల్లా కేంద్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెట్ రాసేందుకు చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్‌ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వేర్వేరు తేదీల్లో 6 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. 1,557 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు వెళ్లనున్నారు.

News January 3, 2026

NLG: తొలగిన కష్టాలు.. పెరిగిన యూరియా కొనుగోళ్లు

image

జిల్లాలో యూరియా యాప్ ద్వారా బుకింగ్ విజయవంతంగా సాగుతుంది. యాప్ ప్రారంభంలో తొలి 2 రోజులు రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత యాప్ బుకింగ్ లో సమస్యలు తొలగిపోవడంతో రైతులకు పారదర్శకంగా యూరియా అందుతుంది. పది రోజుల్లో జిల్లాలో 34,579 మంది రైతులు లక్షకు పైగా యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.