News December 13, 2025
బలి ‘గుమ్మడికాయ’తో ఇద్దామా?

అమ్మవార్లకు చాలామంది కోడి, మేకలను బలి ఇస్తారు. అయితే ఈ జంతు బలి కంటే కూడా గుమ్మడికాయ బలితోనే అమ్మవారు ఎక్కువ సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. కూష్మాండాన్ని శిరస్సుకు ప్రతీకగా భావించి అమ్మవారికి దీన్ని సమర్పించాలని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ విధానమే శ్రేయస్కరమని చెబుతున్నాయి. అందుకే దసరాకి కూష్మాండాన్నే బలిస్తారు. ఇది హింస లేని, దైవ ప్రీతి కలిగించే ఉత్తమ మార్గం.
Similar News
News January 13, 2026
మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.
News January 13, 2026
షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

జమ్ము కశ్మీర్‌లోని షాక్స్‌గామ్ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్‌గామ్ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.
News January 13, 2026
‘భోగి’ ఎంత శుభ దినమో తెలుసా?

భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమ ‘భోగాన్ని’ పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయమిది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపవశాన రైతుల కోసం భూమికి దిగి వచ్చిన రోజూ ఇదే. ఇలా భక్తి, ప్రకృతి, పురాణాల కలయికే ఈ భోగి పండుగ.


