News April 20, 2024

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు

image

పాకిస్థాన్‌లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. నవజాత శిశువుల్లో నలుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Similar News

News November 19, 2024

అంతర్రాష్ట్ర బదిలీలపై AP మంత్రి కీలక ప్రకటన

image

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న AP, TGలోని ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. AP నుంచి 1,942, TG నుంచి 1,447 మంది బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనిపై TG ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన కమిటీలో AP నుంచి మంత్రులు అనగాని, దుర్గేశ్, జనార్దన్, TG నుంచి భట్టి, శ్రీధర్, పొన్నం ఉన్నారన్నారు.

News November 19, 2024

మెలోనీ+మోడీ: మెలోడీ మీటింగ్‌

image

G20 స‌మ్మిట్‌ సందర్భంగా ఇటలీ ప్ర‌ధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక‌ చ‌ర్చ‌లు జ‌రిపారు. వీరి స‌మావేశంపై నెటిజన్లు క్రియేటివ్‌గా స్పందిస్తున్నారు. ఇద్ద‌రు PMల పేర్లు క‌లిపి ‘మెలోడీ మీటింగ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. డిఫెన్స్‌, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల బంధాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డంపై చ‌ర్చించిన‌ట్టు మోదీ తెలిపారు. ఇరు దేశాల మైత్రి ప్రపంచ సుస్థిరతకు మేలు చేస్తుందన్నారు.

News November 19, 2024

రైల్వే స్టేషన్లో రద్దీని తలపించిన విమానాశ్రయాలు!

image

పండగల వేళ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఎలా కిటకిటలాడతాయో ఓసారి గుర్తు చేసుకోండి! NOV 17న దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పరిస్థితి ఇదేనంటే ఆశ్చర్యమేమీ లేదు. ఆరోజు ఏకంగా 5.05లక్షల మంది ప్రయాణించారు. దీంతో ఎయిర్‌పోర్టు లాంజుల్లో చోటు సరిపోక చాలామంది కిందే కూర్చున్నారు. ఇక టికెట్ కౌంటర్లు, ₹400 ఖరీదైన దోసెల క్యూలైన్ ఆగిందే లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఫెస్టివ్, వెడ్డింగ్ సీజన్ కావడమే దీనికి కారణం.