News December 13, 2025

రేవంత్‌ vs KTR: హైదరాబాదీలకు నిరాశ!

image

HYDకు తలమానికంగా రూ.75 కోట్లతో HMDA అభివృద్ధి చేసిన కొత్వాల్‌గూడ ఈకో పార్క్ ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఈ పార్కు ఓపెనింగ్‌‌ను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని KTR విమర్శించారు. DEC 9న CM చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన పార్క్.. KTR విమర్శల కారణంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల కొట్లాటలో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం వంటి అద్భుతాలు చూడాలనుకున్న HYD ప్రజలకు నిరాశే మిగిలింది.

Similar News

News January 1, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో గత వారం రోజులుగా వణికించిన చలి తీవ్రత గురువారం కాస్త తగ్గింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాల వారీగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి: జగిత్యాల జిల్లా కొల్వాయి, రాఘవపేటలో 12.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 13.0, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 13.7, కరీంనగర్ జిల్లా ఆసిఫ్‌నగర్‌లో 14.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

News January 1, 2026

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. మేనూర్, రామలక్ష్మణపల్లి 12.1°C, గాంధారి 12.4, జుక్కల్ 13.1, డోంగ్లి 13.2, దోమకొండ 13.6, మాచాపూర్, పెద్దకొడప్గల్, నాగిరెడ్డిపేట్ 13.8, ఎల్పుగొండ 13.9, లచ్చపేట 14, బిచ్కుంద 14.1, రామారెడ్డి 14.3, పుల్కల్ 14.7, మాక్దూంపూర్ 14.8, పిట్లం, బీర్కూర్ 14.9°Cల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 1, 2026

Stock Market: కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 26,183 వద్ద.. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 85,391 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, ఎటర్నల్, రిలయన్స్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో.. ITC, BEL, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.