News December 13, 2025
రేవంత్ vs KTR: హైదరాబాదీలకు నిరాశ!

HYDకు తలమానికంగా రూ.75 కోట్లతో HMDA అభివృద్ధి చేసిన కొత్వాల్‌గూడ ఈకో పార్క్ ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఈ పార్కు ఓపెనింగ్‌ను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని KTR విమర్శించారు. DEC 9న CM చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన పార్క్.. KTR విమర్శల కారణంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల కొట్లాటలో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం వంటి అద్భుతాలు చూడాలనుకున్న HYD ప్రజలకు నిరాశే మిగిలింది.
Similar News
News March 12, 2026
HYD: గ్యాస్ లేకపోతే ఈ ఆలోచన మీకు రాదా?

రూ.5కే కడుపు నింపుతున్న సంస్థలు స్టీమ్ బాయిలర్లు వాడుతుంటే.. వేలల్లో బిల్లులు వసూలు చేసే 5 స్టార్ హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ వాడుతున్నాయి. గ్యాస్ ధర పెరిగిందని కస్టమర్ల జేబులు కత్తరించే బదులు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్‌ల స్టీమ్ వంట పద్ధతికి మారితే ఖర్చు తగ్గుతుంది కదా. కార్పొరేట్ హాస్టళ్లు గ్యాస్ సంక్షోభం సాకుతో మెస్ ఛార్జీలు పెంచడం కరెక్టేనా? గ్యాస్ లేకపోతే.. స్టీమ్ బాయిలర్లు ఉన్నాయి. <<19364190>>సోచో జరా!<<>>
News March 12, 2026
HYDలో గ్యాస్ సెగ.. రూ.5 ‘బువ్వే దిక్కు’

నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2100 దాటి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. హోటళ్లలో ప్లేట్ మీల్స్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే లక్షలాది మంది విద్యార్థులు, కార్మికులకు రూ.5 భోజనం ప్రాణవాయువులా మారింది. గ్యాస్ కష్టాలను అధిగమించడానికి ఈ కేంద్రాల్లో స్టీమ్ ఆధారిత వంట పద్ధతులను వాడుతున్నారు. గతంలో 150 ఉన్న యూనిట్లు ఇప్పుడు దాదాపు 170కి పెరగడం డిమాండ్‌కు నిదర్శనం.
News March 12, 2026
HYD: ఇది సంక్షోభం కాదు.. ప్రమాదం!

HYDలో పైపుల లీకేజీ సమస్యతో సంక్షోభం కాదు, భూగర్భ జలాలు వేగంగా పడిపోవడమే ప్రమాదం. పాతబస్తీ, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే 2.5మీటర్లకు పడిపోయాయి. భారీ నిర్మాణాలు, కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. ఇంకుడు గుంతలు తప్పనిసరి అని చెబుతున్నా, పాత భవనాల్లో వీటి అమలు సున్నా. వేసవిలో ట్యాంకర్ల వ్యాపారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


