News December 13, 2025

BHPL: ఎన్నికల ఖర్చులు.. లెక్క చెప్పాల్సిందే!

image

జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడిన గెలిచిన ప్రచారం కోసం పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్‌కు చెప్పాలి. ఏ విడత ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసిన రోజు వరకు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల్లో ప్రతి ఒక్క అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే.

Similar News

News January 16, 2026

తప్పిన యుద్ధ గండం: అరబ్ దేశాల దౌత్యంతో వెనక్కి తగ్గిన ట్రంప్!

image

ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. నిరసనకారులపై కాల్పులు, ఉరిశిక్షలను ఇరాన్ నిలిపివేసిందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక సౌదీ, ఖతర్, ఒమన్ దేశాల ‘మధ్యరాత్రి దౌత్యం’ పనిచేసినట్లు తెలుస్తోంది. యుద్ధం వల్ల ప్రాంతీయ అస్థిరత ఏర్పడి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశాలు హెచ్చరించడంతో ట్రంప్ శాంతించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి యుద్ధ భయాలు తొలగినట్లే!

News January 16, 2026

సాయంత్రం 6గంటలకు బిగ్ రివీల్: లోకేశ్

image

AP: గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం గ్లోబల్ హబ్‌గా మారనుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ వరకూ సప్లై చేస్తామని ఆయన వెల్లడించారు. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడుల వల్ల 8 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఈ సాయంత్రం 6గంటలకు బిగ్ రివీల్ కోసం వేచి ఉండండి అని తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భారీ పెట్టుబడుల ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.

News January 16, 2026

మంచిర్యాల: మున్సిపల్ నగారా.. ఆశావహుల ముందస్తు ప్రచారం

image

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల కావడంతో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మాజీ కౌన్సిలర్లతో పాటు కొత్త ముఖాలు రంగంలోకి దిగుతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో, తమకు అనుకూలంగా వస్తుందనే ధీమాతో ఆశావహులు ముందస్తు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.