News December 13, 2025
విశాఖలో అల్లూరి జిల్లా యువకుడి అనుమానాస్పద మృతి

కూర్మన్నపాలెం నిన్న అల్లూరి(D) జీకేవీధికి చెందిన విజయ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కార్ల వాషింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న అతను తన ప్రియురాలిని ఇక్కడికి రమ్మనగా..ఆమె మరో ఇద్దరు మహిళలతో వచ్చింది. వారంతా విజయ్‌కు యజమాని ఇచ్చిన రూమ్‌లో ఉన్నారు. అయితే తర్వాత యజమాని ఖాళీ చేయమనడంతో మహిళలు వెళ్లిపోయారు. ఆ సాయంత్రం రూమ్‌లో విజయ్ మృతి చెంది ఉన్నాడు. ఆ మహిళల ఫోన్లు కలవడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
నాగర్‌కర్నూలు: ఐదుగురు ఏఈఓల సస్పెన్షన్

పాలెం వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఐదుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) సస్పెన్షన్‌కు గురయ్యారు. లీకైన పత్రాల ద్వారా పరీక్షలు రాసి పాసైనట్లు గుర్తించిన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు చర్యలు తీసుకుంది. సస్పెండైన వారంతా పాలెం కళాశాల పూర్వ విద్యార్థులే. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2026
రిపబ్లిక్ డే.. దీపికకు ప్రెసిడెంట్ ఇన్విటేషన్

భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్, ఏపీకి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర వేడుకలకు రావాలంటూ ఆమెకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆహ్వానం పంపారు. శ్రీసత్యసాయి జిల్లాలోని తంబాలహట్టికి వెళ్లిన అధికారులు దీపికకు ఇన్విటేషన్ అందజేశారు. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల అంధుల జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో దీపికపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
News January 13, 2026
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల

రఘునాథపాలెం మండలం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే రోజున శంకుస్థాపన చేసి, నేడు నీళ్లిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. మంచుకొండ లిఫ్ట్‌తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.


