News December 13, 2025

రేపు వరంగల్‌లో టఫ్ ఫైట్..!

image

జిల్లాలో 117 పంచాయతీలకు ఆదివారం జరిగే రెండో విడతపై ఉత్కంఠ నెలకొంది. దుగ్గొండి 33, గీసుగొండ 19, నల్లబెల్లి 29, సంగెం 30 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 117 జీపీలకు ఇప్పటికే 5 ఏకగ్రీవమయ్యాయి. నల్లబెల్లి, దుగ్గొండిలో ఎన్నికలపై BRS, కాంగ్రెస్ నేతలు నువ్వా నేనా? అన్నట్లు ఉండగా, గీసుగొండలో కొండా కాంగ్రెస్, రేవూరి కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. సంగెంలో పాగా వేసేందుకు చల్లా, రేవూరి వర్గాల మధ్య ఆసక్తికర పోటీ ఉంది.

Similar News

News March 21, 2026

WGL: నాలుగు మండలాల్లోనే వర్షం

image

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్‌లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.

News March 20, 2026

WGL: ‘ఈనెల 23న ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు’

image

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో 7వ,8వ,9వ తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై సృజనాత్మకతను ప్రదర్శించాలన్నారు.

News March 20, 2026

యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సమర్పించాలి: వరంగల్ కలెక్టర్

image

ప్రతి శాఖ తమ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రగతి ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయాలన్నారు.