News December 13, 2025

పిఠాపురంలో ఘర్షణ.. కత్తితో దాడి

image

పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద వాహనం పార్కింగ్‌ వివాదం కత్తిపోట్లకు దారితీసింది. స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి పెద్దాపురం నుంచి వచ్చిన ముగ్గురు భక్తులు కారు పార్క్ చేసే క్రమంలో మరో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఘర్షణ తీవ్రం కావడంతో అవతలి వ్యక్తి కత్తి, స్క్రూ డ్రైవర్‌తో భక్తులపై దాడికి తెగబడ్డాడని తెలిపారు. దీంతో తోటి భక్తులు భయాందోళనకు గురయ్యారు.

Similar News

News December 16, 2025

దేశంలోనే తొలి AAD ఎడ్యుసిటీ.. ప్రారంభించనున్న లోకేశ్

image

AP: దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు కానుంది. ఆయా రంగాల్లో వేలాది మంది నిపుణులను తయారుచేసేందుకు 160 ఎకరాల్లో జీఎంఆర్-మాన్సాస్ దీన్ని నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ ఇవాళ విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అంతర్జాతీయంగా పేరొందిన యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి.

News December 16, 2025

పిల్లల ముందు గొడవ పడితే..

image

ప్రస్తుతకాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరిగాయి. దీంతో పిల్లలపై ఇంట్లో వాతావరణం తీవ్రప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు, అక్రమ సంబంధాలు ఉంటే పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతారని ఆస్ట్రేలియాలో చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇవి వారి జీవన నైపుణ్యాలను దెబ్బతీయడంతో పాటు ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

News December 16, 2025

ప్రకాశం: పరారైన ఖైదీ.. 24 గంటల్లో పట్టుబడ్డాడు

image

ఒంగోలు బస్టాండ్ నుంచి ఎస్కార్ట్ కళ్లుగప్పి పరారైన ఖైదీని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జైలు నుంచి వైజాగ్‌కు ఇరువురు నిందితులను తీసుకువెళ్తుండగా ఒంగోలు బస్టాండ్ వద్దకు ఆదివారం రాత్రి ఎస్కార్ట్ పోలీసులు చేరుకున్నారు. అక్కడ వారి కళ్లుగప్పి శ్రీనివాసరావు అనే నిందితుడు పారిపోయాడు. కాగా ఒంగోలు వన్‌టౌన్ PSలో ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.