News December 13, 2025
నిర్మల్: మంత్రాల నేపంతో హత్య చేసి.. కాల్చేశారు..!

మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసి కాల్చి బూడిద చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ CI అజయ్ ప్రకారం.. కడెం మం. గండిగోపాల్పూర్‌కు చెందిన దేశినేని భీమయ్య(55)ను అదే గ్రామానికి చెందిన నరేశ్, మల్లేశ్ ఈనెల 10న భీమయ్యాను కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేశారు.
Similar News
News January 15, 2026
సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూస్తున్నారా?

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడే సన్‌స్క్రీన్‌లో కొన్ని పదార్థాలు కలిస్తే హానికరంగా మారతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ హార్మోన్లపై ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. అందుకే సన్‌స్క్రీన్ కొనేటప్పుడు లేబుల్ కచ్చితంగా చెక్ చేయాలని సూచిస్తున్నారు. ✍️సన్‌స్క్రీన్ వల్ల వచ్చే లాభనష్టాల గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధకేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 15, 2026
మహారాష్ట్రలో ప్రారంభమైన ‘మున్సిపల్’ పోలింగ్

మహారాష్ట్రలో ముంబై (BMC), పుణే సహా 29 కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలపడం, అజిత్ పవార్-శరద్ పవార్ ఏకం కావడం, ఏక్‌నాథ్ షిండే, BJP కూడా తమ పట్టు నిరూపించుకోవాలని చూస్తుండడంతో ఈ ఎన్నికలు ‘మినీ అసెంబ్లీ’ పోరును తలపిస్తున్నాయి. రేపు ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
News January 15, 2026
పండుగలన్నీ చంద్రమానం ప్రకారమే ఎందుకు?

మన శాస్త్రాల ప్రకారం మానవ మనసుపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుని తిథుల ఆధారంగా లెక్కించే చంద్రమానం మన మానసిక స్థితికి, ప్రకృతిలోని మార్పులకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. సూర్యుడు ఒక రాశిలో నెల రోజులు ఉంటే, చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు రాశి మారుతూ సూక్ష్మమైన కాల నిర్ణయానికి సహకరిస్తాడు. అందుకే మన వ్రతాలు, పండుగలు ప్రకృతి లయతో కలిసి సాగాలని పూర్వీకులు ఈ విధానాన్ని అనుసరించారు.


