News December 13, 2025

తిరుపతి: కొత్తగా 1,251 ఉద్యోగాలు.!

image

నాయుడుపేటలోని MP SEZలో PCB తయారీ యూనిట్ ఏర్పాటుకు CIPSA TEC India Pvt Ltdకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 20 ఎకరాల భూమిని 75% రాయితీతో ఆ సంస్థకు కేటాయించింది. రూ.1,140 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టుతో ద్వారా 1,251 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 కింద తొలి 10 ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచి ప్రోత్సాహకాలను అందుకోనుంది.

Similar News

News January 16, 2026

కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేయాలి?

image

కనుమ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మన దేహం ఓ రథమని, దానిని నడిపించేది ఆ పరమాత్ముడేనని ఈ ముగ్గు మనకు గుర్తు చేస్తుంది. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని దేవుడ్ని ప్రార్థించేందుకు ఇదో సంకేతం. అలాగే ఈ ముగ్గు సంక్రాంతికి భూలోకానికి వచ్చిన బలిచక్రవర్తికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికేందుకు కూడా వేస్తారు. ఒక ఇంటి రథం ముగ్గు తాడును మరో ఇంటి ముగ్గుతో కలపడం సామాజిక ఐక్యతకు, ప్రేమానురాగాలకు నిదర్శనం.

News January 16, 2026

ఇరాన్ గగనతలం ఓపెన్.. ఖతర్ తిరిగొచ్చిన US బలగాలు

image

ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు కొంత మేర తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితులు సాధారణ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మూసివేసిన ఇరాన్ గగనతలాన్ని తిరిగి రీ-ఓపెన్ చేయగా, ఖతర్‌లోని ఎయిర్‌బేస్‌కు US బలగాలు మళ్లీ చేరుకున్నాయి. దీంతో ఇరు దేశాలూ శాంతించినట్లు స్పష్టం అవుతోంది.

News January 16, 2026

UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

image

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.