News December 13, 2025
వరంగల్ NIT అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానస్పద మృతి

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి వరంగల్ ఎన్ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి(43) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 7, 2026
వరంగల్: వీడని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మిస్టరీ

మామునూరులోని అద్దె ఇంట్లో ఉంటూ ఉరేసుకుని మృతి చెందిన <<18773300>>బీటెక్ విద్యార్థి మేడం వంశీ వర్మ ఆత్మహత్య<<>> మిస్టరీ వీడలేదు. బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న వంశీ ఇటీవల స్వగ్రామం నుంచి తిరిగి వచ్చి, ఈ నెల 5న ఉదయం తల్లితో మాట్లాడిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు తెలియరాకపోవడంతో పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News January 7, 2026
సిరిసిల్ల: ఇస్రో శాస్త్రవేత్తగా గంభీరావుపేట వాసి.. కేటీఆర్ అభినందనలు

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన సాయి చరణ్ ఇస్రో పరిధిలోని ఎన్ఆర్ఎస్సీలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సాయి చరణ్ స్నేహితుడు ‘ఎక్స్’ వేదికగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి సాయి చరణ్‌కు శుభాకంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు ఎంపికైన సాయి చరణ్, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 7, 2026
‘ప్రజల భద్రతే ముఖ్యం’.. వెనిజులా సంక్షోభంపై భారత్ ఆందోళన

వెనిజులా తాజా పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జైశంకర్ లక్సెంబర్గ్‌లో మాట్లాడుతూ.. ‘వెనిజులా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ శాంతి నెలకొనాలని, అన్ని పక్షాలు ప్రజల భద్రత, సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. వెనిజులాతో భారత్‌కు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభం నుంచి ఆ దేశ ప్రజలు సురక్షితంగా బయటపడాలన్నదే మా ఆకాంక్ష’ అని అన్నారు.


