News April 20, 2024
కొత్త క్రిమినల్ చట్టాలపై సీజేఐ ప్రశంసలు

కొత్త క్రిమినల్ చట్టాలపై సీజేఐ చంద్రచూడ్ ప్రశంసల వర్షం కురిపించారు. నేర న్యాయవ్యవస్థలో సవరణలకు సిద్ధంగా భారతదేశం ఉందని చెప్పారు. ‘నేర న్యాయవ్యవస్థ పరిపాలనలో భారత పురోగతి’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరులుగా మనమంతా ఈ చట్టాలను స్వీకరిస్తే విజయవంతమవుతాయని చెప్పారు. జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 26, 2026
రేపు వైన్స్ బంద్

TG: శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు శుక్రవారం బంద్ కానున్నాయి. మద్యం దుకాణాలు రేపు మూసి ఉంటాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వైన్స్‌తో పాటు కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, మిలిటరీ క్యాంటీన్లు బంద్ చేయాలని హైదరాబాద్‌లో ఆదేశాలు జారీ అయ్యాయి.
News March 26, 2026
ఇరాన్‌కు షాక్.. హార్ముజ్ బ్లాక్ చేసిన నేవీ చీఫ్ హతం!

హార్ముజ్ ఒడ్డున ఉండే బందర్ అబ్బాస్ సిటీపై జరిపిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలీరెజా హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హార్ముజ్‌ను బ్లాక్ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ జలసంధిపై పట్టు కోసం యుద్ధం సాగుతున్న వేళ ఇది కీలక పరిణామంగా మారింది.
News March 26, 2026
వీర సైనికులకు కేంద్రం గుడ్ న్యూస్!

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. సేన, నేవీ సేన, వాయు సేన పతకాలు పొందిన జవాన్లకు ఇండియన్ రైల్వేలో లైఫ్‌లాంగ్ ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మరొకరితో కలిసి ఫస్ట్ క్లాస్, 2 ఏసీ లేదా ఏసీ ఛైర్ కార్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం అవార్డు గ్రహీతలకు, వారి జీవిత భాగస్వాములకు లేదా అవివాహిత అమరవీరుల తల్లిదండ్రులకు వర్తిస్తుంది.


