News December 13, 2025

నెలలో జరీబు భూముల సమస్యల పరిష్కారం: పెమ్మసాని

image

AP: అమరావతిలో జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల సమయం కోరామని కేంద్ర మంత్రి P.చంద్రశేఖర్ తెలిపారు. సాయిల్ టెస్ట్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘రాజధాని గ్రామాల్లో శ్మశానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తాం. ల్యాండ్ పూలింగ్‌లో ఇప్పటికీ 2,400 ఎకరాలను కొందరు రైతులు ఇవ్వలేదు. వారితో మరోసారి చర్చిస్తాం. భూసమీకరణ కుదరకపోతే భూసేకరణ చేస్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 15, 2026

సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

image

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.

News March 15, 2026

రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా?

image

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు, మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణంపై వాడీవేడి చర్చలకు ఆస్కారం ఉంది. సభకు KCR హాజరవడంపై క్లారిటీ లేదు. గతంలో సమావేశాల తొలి రోజున మాత్రమే BRS చీఫ్ హాజరయ్యేవారు.

News March 15, 2026

102 ఏళ్ల బామ్మ.. రోజూ మద్యం, మాంసం తీసుకుంటూ..

image

చక్కటి జీవనశైలితోనే ఎక్కువ కాలం జీవిస్తారనే సిద్ధాంతానికి సవాల్ విసురుతున్నారు చైనాకు చెందిన జిన్ బావోలింగ్(102). ఆమె రోజూ పంది మాంసం, కేక్స్, బ్రెడ్స్, బ్రౌన్ షుగర్‌తో కాఫీ, ఆల్కహాల్ తీసుకుంటారు. రోజుకు 15 గంటలు నిద్రపోతారు. కూరగాయలు అరుదుగా తినే బామ్మ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఆస్పత్రి మెట్లు ఎక్కలేదని కుటుంబీకులు చెప్పారు. జిన్ స్టోరీ SMలో వైరలవుతోంది.