News December 13, 2025
చౌటుప్పల్: ‘ఆస్తులు పెరిగితే గ్రామానికే రాసిస్తా’

యాదాద్రి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మండలంలో దేవలమ్మ నాగారం సర్పంచ్ అభ్యర్థి కొండ హారిక విజయ్ వినూత్నంగా హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం తన ఆస్తులు పెరిగితే ఆ పెరిగిన ఆస్తులన్నింటినీ గ్రామాభివృద్ధికి ప్రజల పేరున రాసిస్తానని బాండ్ పేపర్‌పై రాసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాగా హారిక విజయ్ హామీ ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News January 13, 2026
మేడారం మహాజాతర.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

TG: మేడారం భక్తుల కోసం ‘MyMedaram’ పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మెసేజ్ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. ఈ సేవలు వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
News January 13, 2026
కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండవచ్చా?

నివాస గృహాలలో ఓ కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యం, ప్రశాంతత సొంతమవుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఈ నిర్మాణం గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి, గదుల ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంచుతుంది. సరైన వెలుతురు ప్రసరిస్తుంది. తద్వారా దైవకళతో ఉట్టిపడుతుంది. ఇది పని పట్ల ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 13, 2026
నల్గొండ: కరడుగట్టిన దొంగల అరెస్ట్

నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ జి.రమేశ్ తెలిపారు. సూర్యాపేట జిల్లాకు చెందిన పాత నేరస్థుడు గునిగంటి మహేశ్, HYDకు చెందిన పాత్లావత్ వినయ్ కొంతకాలంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతేడాది నవంబర్‌లో కేతేపల్లి పరిధిలో ఓ మహిళను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో సాంకేతిక పరిజ్ఞానంతో వీరిని పట్టుకున్నారు.


