News December 13, 2025
భూపాలపల్లిలో నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

జిల్లాలో మామునూరు, చొప్పదండి నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. భూపాలపల్లి జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 253 మందికి 181 మంది (హాజరు 72.01), కాటారం జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 198 మందికి 133 మంది హాజరైనట్లు డీఈఓ ఎం.రాజేందర్ తెలిపారు. మొత్తం 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
Similar News
News January 26, 2026
ఇండోర్‌లో కలుషిత నీరు.. 28కి చేరిన మరణాలు

MPలోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్‌పురలో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోవ్‌లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అటు ప్రభుత్వం 21 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కాగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపారు.
News January 26, 2026
సింగరేణి సెగ.. Dy.CM భట్టి ‘ఒంటరి’ పోరాటం!

సింగరేణి బొగ్గు టెండర్ల కేటాయింపు వ్యవహారం ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శల దాడిని Dy.CM భట్టి విక్రమార్క ఒక్కరే తిప్పికొడుతున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను ఆయన గట్టిగా ఖండిస్తున్నా.. సొంత జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మౌనం వహించడం చర్చనీయాంశమైంది. సహచరుల నుంచి మద్దతు కరువవ్వడంపై భట్టి వర్గం గుర్రుగా ఉంది.
News January 26, 2026
312 పోస్టులు.. అప్లైకి మూడు రోజులే ఛాన్స్

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి 3 రోజులే ( JAN 29) సమయం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


