News December 13, 2025
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలి: కలెక్టర్ తేజస్

రెండో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఎన్నికల అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), పోలింగ్ అధికారులు (పీవో), సహాయ పోలింగ్ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎన్నికల విధులను నిర్వహించాలని సూచించారు.
Similar News
News January 15, 2026
ఆమిర్ ఖాన్ కొడుకు సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన హీరోయిన్ సాయిపల్లవి నటిస్తున్నారు. ‘ఏక్ దిన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు టీజర్ రిలీజ్ కానుంది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్నారు. కాగా సాయిపల్లవి రణ్‌బీర్ ‘రామాయణ’లోనూ నటిస్తుండగా ఈ మూవీ దీపావళికి రిలీజ్ కానుంది.
News January 15, 2026
భద్రాద్రి: మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లు ఇలా..!

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను ST-11, SC-12, BC-7, UR-30 డివిజన్లు కేటాయించారు. ఇల్లందులో మొత్తం 24 వార్డులకు గాను ST-2, SC-4, BC-6, జనరల్ మహిళా-6, UR-6, అశ్వరావుపేటలో మొత్తం 22 వార్డులకు గాను ST-3, SC-4, BC-4, జనరల్ మహిళ-6 కేటాయించారు. డివిజన్, వార్డుల వారీ రిజర్వేషన్లు రావాల్సి ఉంది.
News January 15, 2026
ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు.


