News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.
Similar News
News January 12, 2026
పండగకు ఏ చీర కొంటున్నారు?

పండుగ సమయంలో మంగళగిరి పట్టు చీర ధరిస్తే హుందాగా ఉంటుంది. ఇవి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ రకాల్లో మార్కెట్లో లభిస్తాయి. యువతులకైనా, మధ్యవయస్కులకైనా ఇవి సూపర్‌గా ఉంటాయి. పైథానీ పట్టు చీర మెరుస్తూ మంచి లుక్ ఇస్తుంది. గద్వాల్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పట్టులో కాకుండా ఫ్యాన్సీలో ట్రెండీగా కనిపించాలనుకుంటే ప్రింట్ చీరలు తీసుకోవచ్చు. ఏవి కట్టుకున్నా దాన్ని హుందాగా క్యారీ చేస్తే అందరి దృష్టీ మీ పైనే..
News January 12, 2026
ఇక డాక్టర్ చదువులు అక్కర్లేదట.. ఎందుకో చెప్పిన మస్క్!

ఎంతో కష్టపడి చదివి మనిషి ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ కోర్సులు ఇక అవసరం లేదట. వైద్య విద్యలన్నీ ఉపయోగం లేకుండా పోతాయట. ప్రపంచ కుబేరుడు మస్క్ అంచనాలివి. AIలో వస్తున్న మార్పులతో భవిష్యత్తులో రోబోలే క్లిష్టమైన సర్జరీలూ చేస్తాయని చెప్పారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ ఆరోగ్య సంరక్షణ సేవలూ మెరుగవుతాయని తెలిపారు. ఒక దేశాధ్యక్షుడికి అందే వైద్య సౌకర్యాలు సామాన్యుడికీ అందుబాటులోకి వస్తాయన్నారు.
News January 12, 2026
రైతులకు బోనస్ డబ్బులు విడుదల

TG: సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.1,429 కోట్ల బోనస్ డబ్బులు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.


