News December 13, 2025

తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం తనిఖీ చేసిన SP

image

తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని SP డి.నరసింహ కిషోర్ శనివారం సందర్శించారు. త్వరలో స్టైపెండరీ క్యాడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన పనులు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. ఎటువంటి అంతరాయం లేకుండా పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.

Similar News

News February 2, 2026

కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకం: సోము వీర్రాజు

image

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదని MLC సోము వీర్రాజు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని BJP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ ఏపీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉందని, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో 350 సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

News February 2, 2026

సీతానగరం: యధాతథంగా ఇంటర్ ప్రాక్టికల్స్

image

సీతానగరం మండలంలో పులి సంచారం కారణంగా పాఠశాలలు, ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు సోమవారం సెలవు ప్రకటించారు. అయితే, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం మంగళవారం యధాతథంగా ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ. శారద ఆదివారం స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి పరీక్షలకు హాజరుకావాలని ఆమె కోరారు.

News February 2, 2026

రాజమండ్రి: నేడు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం వెబ్‌సైట్ నుంచి కూడా సమర్పించవచ్చని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకే ఈ కార్యక్రమమని వెల్లడించారు.