News December 13, 2025

గన్నవరం: పంచాయతీ ఎన్నికలు.. వంశీ వ్యూహంపై ఆసక్తి.!

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మైనింగ్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయడానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే వంశీ ఇటీవల పార్టీ సమావేశాల్లో పాల్గొనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ఆయన వ్యూహ రచన ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Similar News

News March 11, 2026

గ్యాస్ సిలిండర్లపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు: SP

image

ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ధరలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP విద్యాసాగర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా చర్యలు తప్పవన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

News March 11, 2026

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి మృతి

image

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1984,1989,1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

News March 10, 2026

కృష్ణా: ‘పుర’లో ప్రత్యేక పాలన

image

స్థానిక సంస్థలైన నగర పాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18 నుంచి ప్రత్యేక అధికారులు అధికారం చేపట్టనున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌కు కలెక్టర్, పెడన మున్సిపాల్టీకి RDO, పెడనకు MUDA VC ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.