News December 13, 2025
NRPT: రెండో విడత పోలింగ్‌కు సిద్ధం

నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలాల పరిధిలో రెండో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆదివారం రోజు 95 గ్రామ పంచాయతీలకు, 900 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ గెలుపుపై దీమా వ్యక్తం చేస్తుండగా, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Similar News
News January 17, 2026
గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ నమోదైన కేసులో మాజీ MP గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.
News January 17, 2026
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News January 17, 2026
ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.


