News December 13, 2025

NLG: ఈసీపై నమ్మకం పోయింది: జగదీష్ రెడ్డి

image

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దారుణంగా మారిందని, ఈసీపై నమ్మకం పోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

Similar News

News January 14, 2026

బంగ్లా ఎన్నికలపై మైనార్టీల్లో భయాందోళనలు

image

బంగ్లాదేశ్‌లో FEB 12న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో పాల్గొనడంపై మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్యతా మండలి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్‌ను కలిశాయి. భద్రతపై ప్రజల ఆందోళనను తెలియజేశాయి. ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరాయి.

News January 14, 2026

HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

image

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..

News January 14, 2026

భద్రాద్రి: పండుగ వేళ విషాదం.. బస్సు ఢీకొని మహిళ మృతి

image

చండ్రుగొండ మండల కేంద్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న ఓ మహిళను భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సంక్రాంతి సంబరాల్లో ఉండాల్సిన కుటుంబంలో ఈ ఘటనతో పెను విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.