News December 13, 2025

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>స్పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 11 చీఫ్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా లేదా ఒలింపిక్స్ /పారాలింపిక్స్/ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

Similar News

News January 14, 2026

తల్లి బాటలోనే కుమారుల పయనం

image

2011లో కేవలం 10, 12 పశువులతో మణిబెన్ జేసుంగ్ చౌదరి పాల ఉత్పత్తి ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు బన్నీ, మెహ్సాని, ముర్రా గేదెలు, హెచ్‌ఎఫ్ ఆవులు, స్వదేశీ కంక్రేజ్ జాతులు ఆమె డెయిరీలో ఉన్నాయి. మణిబెన్ ముగ్గురు కుమారులు గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ.. వారు పూర్తిగా ఈ పాడి పరిశ్రమలోనే పనిచేస్తున్నారు. ఆధునిక మిల్కింగ్ యంత్రాల సహాయంతో ఆవులు, గేదెలకు పాలు పితుకుతూ తల్లికి తోడుగా నిలుస్తున్నారు.

News January 14, 2026

ఆస్టియోపోరోసిస్‌ ముప్పు వారికే ఎక్కువ

image

మెనోపాజ్‌దశలో ఆడవాళ్లలో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సంతాన సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్‌ మరింత ఎక్కువని ఫెర్టిలిటీ అండ్‌ స్టెరిలిటీ జర్నల్‌లోని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో సంతాన లేమి, గర్భస్రావం, మృత శిశువు జన్మించటం వంటివి జరిగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్‌ ముప్పు 16శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

News January 14, 2026

సంక్రాంతి: నల్ల నువ్వులతో ఈ పరిహారాలు పాటిస్తే?

image

సంక్రాంతి నాడు నల్ల నువ్వుల దానం సిరిసంపదలను ప్రసాదిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పితృదేవతలు శాంతించి, వంశాభివృద్ధి కలుగుతుందని సూచిస్తున్నారు. ‘దీనివల్ల శని దోషాలు కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల చలికాలపు అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది’ అని వివరిస్తున్నారు. మరిన్ని సంక్రాంతి విశేషాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.