News December 13, 2025
వనపర్తి: రెండో విడత ఎన్నికలకు భారీ భద్రత: ఎస్పీ

వనపర్తి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1,150 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఆదివారం 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.
Similar News
News January 9, 2026
అన్నమయ్య: 12 తర్వాత ఎప్పుడైనా సమ్మె

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈనెల 12వ తేదీ తర్వాత ఏ క్షణమైన సమ్మెకు వెళ్తామని CITU జిల్లా గౌరవ అధ్యక్షుడు రామాంజులు, జిల్లా అధ్యక్షుడు రమణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ చలపతి తెలిపారు. 108 కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లెలోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట గురువారం నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో మధుసూదన్‌కు సమ్మె నోటీస్ ఇచ్చారు.
News January 9, 2026
సంగారెడ్డి: ఈనెల 18 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని రకాల జూనియర్ కళాశాలలకు రేపటి నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. సెలవుల అనంతరం తిరిగి 19న కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డీఐఈవో స్పష్టం చేశారు.
News January 9, 2026
వరంగల్ జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

వరంగల్ జిల్లాలోని యాసంగి 2025- 26 పంటల సాగుకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ యాసంగి పంటకు 19770 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 9770 మెట్రిక్ టన్నుల జనవరి మాసంలో రైతులకు అవసరం మేరకు అందించడం జరుగుతుందన్నారు.


