News December 13, 2025

MBNR: రెండో విడత.. ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ

image

MBNR జిల్లాలోని 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 151 గ్రామాలు, 255 పోలింగ్ కేంద్రాలు, 1334 పోలింగ్ స్టేషన్లు, 36 సమస్యాత్మక గ్రామాలలో 42 లొకేషన్లు 355 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎస్పీ డి.జానకి అన్నారు. రూట్ మొబైల్స్-49, FST-16, స్ట్రైకింగ్ ఫోర్సులు-5, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు- 5 ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేశామన్నారు.

Similar News

News April 2, 2026

MBNR: గుంపులుగా నాగుపాములు.. గ్రామంలో భయాందోళన

image

చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామం రెండవ వార్డులో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 35 నాగుపాములను స్థానికులు చంపారు. వార్డులో నివసిస్తున్న విశ్వనాధ్ ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాములు సంచారిస్తున్నాయని కాలనీవాసులు తెలిపారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. చంపబడిన వాటిలో చిన్న పాములు కూడా ఉండటం గమనార్హం.

News April 1, 2026

మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆనందరావు

image

మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆనందరావు బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు తన సహచర న్యాయవాదులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. న్యాయవాదుల ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి పాల్గొన్నారు.

News April 1, 2026

హనుమాన్ జయంతి వేడుకల్లో మేయర్ మమత

image

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మేయర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ఆయన ఆశీర్వచనం ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.