News April 20, 2024

చంద్రబాబుకు మోదీ బర్త్ డే విషెస్

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయన ఎప్పుడూ ఏపీ అభివృద్ధి కోసమే తపిస్తారు. ప్రజా సేవలో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.

Similar News

News March 26, 2026

RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

IPL: ఎల్లుండి లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో RCB జట్టు కీలక బౌలర్ హేజిల్‌వుడ్ ఇండియా చేరుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన కొద్దిసేపటి కిందటే బెంగళూరుకు వచ్చారు. ఇవాళ RCB క్యాంప్‌లో జాయిన్ కానున్న ఆయన 28వ తేదీ SRHతో జరిగే తొలి మ్యాచులో ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఆ జట్టు కీలక బౌలర్ యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో దూరమైన వేళ హేజిల్‌వుడ్ రాకతో RCB బౌలింగ్ దళం బలం పుంజుకున్నట్లు అయింది.

News March 26, 2026

సమ్మర్ స్పెషల్: మీ పిల్లలను ఛాంపియన్లుగా మార్చండి!

image

వేసవి సెలవుల్లో పిల్లల సమయాన్ని వృథా చేయకుండా ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. ముఖ్యంగా పిల్లల శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ నేర్పించడం వల్ల శరీరం చల్లబడటమే కాక మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే ఏకాగ్రత కోసం యోగా, మెడిటేషన్.. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇవి పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తాయి. <<-se>>#SummerSPL<<>>

News March 26, 2026

ఏదో ఒకటి తేల్చుకోండి.. లేకపోతే: ట్రంప్

image

తమతో డీల్‌ కోసం ఇరాన్ అడుక్కుంటోందని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. కానీ బయటి ప్రపంచానికి మాత్రం మరోలా చెబుతోందన్నారు. ఏదో ఒక విషయం ఆ దేశం త్వరగా తేల్చుకోకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయని హెచ్చరించారు. తాము ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడబోమని తేల్చి చెప్పారు. కాగా 5 రోజులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చామని ఇటీవల ఆయన ప్రకటించగా, తమకు అగ్రరాజ్యం భయపడిందని ఇరాన్ చెప్పిన విషయం తెలిసిందే.