News December 13, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాలీలు, గుంపులపై నిషేధం: ఎస్పీ

నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకూడదని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జిల్లాలో BNSS 163 అమలులో ఉన్నందున, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా, డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Similar News
News January 8, 2026
ఉరి వేసుకుని మిర్యాలగూడలో మహిళ ఆత్మహత్య

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో బుధవారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డపాక జగదీష్ తన భార్య నాగమణితో కలిసి పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం బాత్రూంకు వెళ్లిన నాగమణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 7, 2026
చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీల షెడ్యూల్ ఇదే

ఈ నెలలో జరగనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2025-26, క్రీడా పోటీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరగనున్నాయి.
News January 7, 2026
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

నల్లగొండలోని ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ పూర్తయిందని వివరించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.


