News December 13, 2025
FLASH: చిట్యాల MPDOను సస్పెండ్ చేసిన కలెక్టర్

చిట్యాల మండలం చిన్నకాపర్తిలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ స్లిప్పులు డ్రైనేజీలో కనిపించిన ఘటనపై నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మితో పాటు పదిమంది పోలింగ్ ఆఫీసర్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మొత్తానికి చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్ల కలకలంపై అధికారులపై వేటు పడింది.
Similar News
News December 16, 2025
కర్నూలు: నడిరోడ్డుపై పసికందు.!

కర్నూలులో అమ్మ తనానికే మచ్చ తెచ్చే అవానవీయ ఘటన జరిగింది. నవ మాసాలు మోసి కన్న నెలలు నిండని పాపను రోడ్డుపై పడేసిందో కసాయి తల్లి. మంగళవారం ఉదయం నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ పేట రోడ్డుపై పాపను గుర్తించి సామాజిక కార్యకర్త అక్కున చేర్చుకున్నాడు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.
News December 16, 2025
ఆరోగ్య భద్రతకు డిజిటల్ హెల్త్ రికార్డులు: CBN

AP: ప్రజల ఆరోగ్య భద్రతకు సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నట్లు CM CBN తెలిపారు. రియల్ టైమ్‌లోనే ఆరోగ్య వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామన్నారు. ‘రోగాలను ముందుగా నిరోధించే ప్రివెంటివ్ టెక్నాలజీస్‌పై దృష్టి పెట్టాలి. యోగా, నేచురోపతిని ప్రోత్సహించాలి. డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్‌పై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.
News December 16, 2025
34ఏళ్లకే బిలియనీర్ అయిన మీషో CEO

ప్రముఖ E-కామర్స్ ప్లాట్‌ఫాం Meesho కో-ఫౌండర్, CEO విదిత్ ఆత్రే 34ఏళ్లకే బిలియనీర్‌గా మారారు. ఇటీవల స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మీషో షేర్లు ఇష్యూ ధర రూ.111 నుంచి రూ.193కు ఎగబాకడంతో ఆయన నెట్‌వర్త్ 1B డాలర్లను దాటింది. కంపెనీలో 11.1 శాతం వాటా కలిగిన ఆత్రే షేర్ల విలువ ప్రస్తుతం సుమారు రూ.9,128 కోట్లుగా ఉంది. మరో కో-ఫౌండర్ సంజీవ్ బర్న్‌వాల్ సంపద కూడా భారీగా పెరిగి రూ.6,099 కోట్లకు చేరుకుంది.


