News December 14, 2025
Kerala: కమ్యూనిస్టులకు ఎదురుదెబ్బ!

కేరళ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా కనిపించింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని అధికార LDFకు ఈ ఫలితాలు షాకిచ్చాయి. UDF(కాంగ్రెస్) బలం పుంజుకుంది. 6 కార్పొరేషన్లలో 4, 86 మున్సిపాలిటీల్లో 54, 941 పంచాయతీల్లో 504 స్థానాలను గెలుచుకుంది. LDFకు ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు <<18552178>>తిరువనంతపురం<<>> కార్పొరేషన్‌లో NDA గెలిచింది. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు షాక్ తప్పదనే చర్చ సాగుతోంది.
Similar News
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News January 3, 2026
చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.


