News December 14, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 43,824 కేసులు పరిష్కారం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్‌లో 43,824 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి తెలిపారు. ఇందులో 38,525 క్రిమినల్ కేసులు ఉండగా 331 సివిల్, 1,313 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్నారు. 142 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లైమ్‌లను పరిష్కరించి రూ. 9.85 కోట్లు పరిహారంగా చెల్లించడం జరిగిందన్నారు.
Similar News
News December 31, 2025
నిమ్మకాయ దీపం ఎలా వెలిగించాలి?

తాజా నిమ్మకాయ తీసుకుని, దానిని 2 సమ భాగాలుగా కోసి, రసాన్ని తీసేసి, తొక్కను వెనక్కి తిప్పాలి. దీంతో అది కప్పు ఆకారంలోకి మారుతుంది. ఇప్పుడు ఆ కప్పులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి, దూదితో చేసిన వత్తిని వేయాలి. పసుపు, కుంకుమలతో అలంకరించి, దీపాన్ని వెలిగించాలి. సాధారణంగా ఈ దీపాలను రాహుకాలంలో దుర్గాదేవి ముందు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీపం నేరుగా నేలపై కాకుండా ప్లేటు లేదా ఆకును ఉంచడం మంచిది.
News December 31, 2025
కృష్ణా: దద్దరిల్లిన రాజకీయాలు.. కటకటాల్లోకి కీలక నేతలు.!

ఈ ఏడాది కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంచలన అరెస్టులు ప్రకంపనలు సృష్టించాయి. ఫిబ్రవరిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొడాలి నాని, వంశీ అనుచరులు కూడా వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామాలు 2025 రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశాయి.
News December 31, 2025
MBNR: కురుమూర్తిలో నేడు గిరి ప్రదక్షిణ

అమ్మాపూర్ సమీపంలోని ప్రసిద్ధ కురుమూర్తి స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ‘పేదల తిరుపతి’గా వెలుగొందుతున్న స్వామివారి గిరి ప్రదక్షిణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.


