News December 14, 2025

భద్రాద్రి: 16 ఏకగ్రీవం.. 138 పంచాయతీలకు ఎన్నికలు

image

భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లోని జీపీలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 16 గ్రామాల్లో సర్పంచ్‌లు, 386 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 138 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1,006 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.

Similar News

News January 11, 2026

సిద్దిపేట: ‘ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి’

image

రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాంపల్లిలో నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని లేకపోతే PM కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అవరోధం ఏర్పడుతుందన్నారు.

News January 11, 2026

వర్ధన్నపేట: NH-563పై మృత్యుశకటాలు

image

వర్ధన్నపేట శివారులోని కెనాల్ నుంచి మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానిక అవసరాల పేరుతో పర్మిషన్లు తెచ్చుకుని పదుల సంఖ్యలో లారీలతో వరంగల్‌కు మట్టిని తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. NH-563పై లారీలు అతివేగంతో దూసుకెళ్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేత అండదండలతోనే దందా సాగుతోందని, అందుకే అధికారులు పట్టించకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

News January 11, 2026

గండికోట ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

image

గండికోట ఉత్సవాల్లో సందర్శకులకు ఆహ్లాదంతోపాటు వినోదంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గండికోట ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన భాగంగా జిల్లా కలెక్టర్ మీడియాతో శనివారం మాట్లాడారు. గండికోట ఉత్సవాల్లో సందర్శకులకు మరింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే విధంగా ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.