News April 20, 2024
అందుకే ధోనీ లేటుగా వస్తున్నారు: ఫ్లెమింగ్

CSK ఆటగాడు ధోనీ ఆఖరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చారు. ‘గత ఏడాది ధోనీ మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దానికి సంబంధించిన నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. తనను చూసేందుకే స్టేడియానికి వచ్చే ఫ్యాన్స్‌ను నిరాశపరచకూడదనే చివర్లోనైనా బ్యాటింగ్‌కి వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి ఆయనకు లభించే ప్రేమ అద్భుతం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 5, 2026
$400bn మార్కును దాటిన గూగుల్ రెవెన్యూ: సుందర్ పిచాయ్

గూగుల్ యాన్యువల్ రెవెన్యూ తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. FY25 Q4 ఫలితాలను ఆయన వెల్లడించారు. 2025లో యూట్యూబ్ రెవెన్యూ 60 బిలియన్ డాలర్లను దాటినట్లు పేర్కొన్నారు. జెమినీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 750M+గా ఉన్నట్లు చెప్పారు. AI స్టాక్, జెమినీ 3 అడాప్షన్ తమ కంపెనీ ప్రోగ్రెస్‌కి ఫ్యూయల్‌లా పనిచేస్తున్నాయని వివరించారు.
News February 5, 2026
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News February 5, 2026
ఉదయం లేవగానే ఇది కనిపించిందా?

శాస్త్రాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే బల్లిని చూడటం అదృష్టం. ఇది మీ దురదృష్టం తొలగి, విజయం వరించడాన్ని సూచిస్తుంది. బల్లి గోడపైకి పాకుతూ కనిపిస్తే పదోన్నతికి, ఆర్థిక లాభానికి సంకేతం. జ్యోతిషశాస్త్రం ప్రకారం బల్లి తలపై పడితే సమాజంలో గౌరవం పెరుగుతుందని, భుజంపై పడితే పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుందని నమ్మకం. ఈ శుభ శకునాలు మీ జీవితంలో సానుకూల మార్పులను, సిరిసంపదలను తీసుకువస్తాయి.


