News April 20, 2024

విజయవాడ: పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేశ్ ఫైర్

image

జనసేన పార్టీ ఎకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను నాలుగేళ్ల నుంచి విడుదల చేయకుండా తన బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు పవన్ వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Similar News

News March 4, 2026

చల్లపల్లి: చాకుతో బెదిరించి.. బంగారం దోపిడీ

image

చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో మంగళవారం దోపిడీ కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 78 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వంటగదిలోకి చొరబడ్డారు. చాకుతో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ దుర్గాంజనేయులు తెలిపారు.

News March 2, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణా యూనివర్సిటీ MBA/MCA పరీక్షల షెడ్యూల్ విడుదల
* కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్
* కృష్ణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 255 మంది గైర్హాజరు
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాణాసంచా దుకాణాల్లో తనిఖీలు
* విజయవాడలో ప్రాణం తీసిన సెల్ఫీ
* గన్నవరంలో గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి అభ్యంతరం

News March 2, 2026

కృష్ణా: సుంకం ఇవ్వు .. చెరువు తవ్వు..!

image

కృష్ణా జిల్లాలో వరి పొలాలు అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ పరిధిలో వందల ఎకరాల సాగు భూములతో పాటు మడ అడవులను సైతం ఆక్రమించి తవ్వకాలు జరుపుతున్నారు. చెరువుల వ్యర్థ నీరు కాలువల్లోకి వదులుతుండటంతో పక్కనే ఉన్న పంట పొలాలు నిస్సారమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతోనే ఇవి జరుగుతున్నాయని టాక్.