News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.
Similar News
News January 15, 2026
సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూస్తున్నారా?

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడే సన్‌స్క్రీన్‌లో కొన్ని పదార్థాలు కలిస్తే హానికరంగా మారతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ హార్మోన్లపై ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. అందుకే సన్‌స్క్రీన్ కొనేటప్పుడు లేబుల్ కచ్చితంగా చెక్ చేయాలని సూచిస్తున్నారు. ✍️సన్‌స్క్రీన్ వల్ల వచ్చే లాభనష్టాల గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధకేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 15, 2026
మహారాష్ట్రలో ప్రారంభమైన ‘మున్సిపల్’ పోలింగ్

మహారాష్ట్రలో ముంబై (BMC), పుణే సహా 29 కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలపడం, అజిత్ పవార్-శరద్ పవార్ ఏకం కావడం, ఏక్‌నాథ్ షిండే, BJP కూడా తమ పట్టు నిరూపించుకోవాలని చూస్తుండడంతో ఈ ఎన్నికలు ‘మినీ అసెంబ్లీ’ పోరును తలపిస్తున్నాయి. రేపు ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
News January 15, 2026
పండుగలన్నీ చంద్రమానం ప్రకారమే ఎందుకు?

మన శాస్త్రాల ప్రకారం మానవ మనసుపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుని తిథుల ఆధారంగా లెక్కించే చంద్రమానం మన మానసిక స్థితికి, ప్రకృతిలోని మార్పులకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. సూర్యుడు ఒక రాశిలో నెల రోజులు ఉంటే, చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు రాశి మారుతూ సూక్ష్మమైన కాల నిర్ణయానికి సహకరిస్తాడు. అందుకే మన వ్రతాలు, పండుగలు ప్రకృతి లయతో కలిసి సాగాలని పూర్వీకులు ఈ విధానాన్ని అనుసరించారు.


