News December 14, 2025
చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News January 10, 2026
NZB: సంక్రాతి సెలవులకు ఊర్లకు వెళ్లే వారికి ముఖ్య సూచనలు

సంక్రాంతి సెలవులకు సొంత గ్రామాలకు వెళ్లే వారికి నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ముఖ్య సూచనలు చేశారు. ఖరీదైన వస్తువులు, డబ్బు, బంగారం బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దన్నారు. ఇంటికి బలమైన తాళాలు, సెంట్రల్ లాకింగ్ ఉపయోగించాలన్నారు. సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు.
News January 10, 2026
NZB: వారం రోజుల్లో 232 డ్రంకెన్ డ్రైవ్ కేసులు: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 232 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా రూ.22.40 లక్షల జరిమానా విధించారన్నారు. ఇందులో ఆరుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహనదారులు ధ్రువపత్రాలు సక్రమంగా తమ వద్ద ఉంచుకోవాలని ఆయన సూచించారు.
News January 10, 2026
NZB: కలెక్టర్, సలహాదారుని కలిసిన రెడ్ క్రాస్ సభ్యులు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని NZB జిల్లా రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. కమిటీ జిల్లా ఛైర్మన్ ఆంజనేయులు జిల్లా రెడ్ క్రాస్ గురించి వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బపూర్ రవీందర్, వరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.


