News December 14, 2025

మరికాసేపట్లో..

image

TG: ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. 415 GPలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 38,350 పోలింగ్ సెంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News

News January 3, 2026

కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.

News January 3, 2026

చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

image

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.

News January 3, 2026

వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నాం: ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వెనిజులాలో భారీ పేలుళ్లకు పాల్పడింది మేమే. <<18750335>>ప్రెసిడెంట్ <<>>నికోలస్ మధురో, ఆయన భార్య ఇప్పుడు మా అదుపులో ఉన్నారు. US లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ లార్జ్ స్కేల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాం. ఇంటర్నేషనల్ డ్రగ్స్‌ కేంద్రంగా వెనిజులా మారింది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.