News April 20, 2024
మహిళా సాధికారత కోసమే సూపర్-6: బ్రాహ్మణి
AP: మహిళా సాధికారత కోసమే సూపర్-6 పథకాలు తీసుకువస్తున్నట్లు నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం తపిస్తుంటారు. వయసు పెరుగుతున్నా చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. లోకేశ్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 19, 2024
విశాఖలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
AP: విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లతో చిత్రీకరించి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా తండ్రి కాపాడారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు వంశీ, ఆనంద్, రాజేశ్, జగదీశ్‌ను అరెస్టు చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని హోంమంత్రి అనిత ఆదేశించారు.
News November 19, 2024
TTDలో ఇక హిందూ ఉద్యోగులే..
AP: టీటీడీలో 7వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా అందులో 300 మంది అన్యమతస్థులు (హిందువులు కాని వారు) ఉన్నారు. తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపుతారు. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(5) సమ్మతిస్తుంది. కాగా టీటీడీలో హిందువులే ఉద్యోగులుగా ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. TTD తాజా నిర్ణయంపై మీ కామెంట్?
News November 19, 2024
ఈరోజు నేను గర్వపడుతున్నా: పవన్
తక్కువ వ్యవధిలోనే 18 ఉమెన్ మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు విజయవాడ పోలీసులు ట్వీట్ చేయగా DyCM పవన్ స్పందించారు. ‘YCP పాలనలో 30,000+ మహిళలు & బాలికలు తప్పిపోయారు. వారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. APలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ ఉండటంతో ఈరోజు విజయవాడ పోలీసులు ఈ కేసులను ఛేదించినందుకు నేను గర్వపడుతున్నా. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, పోలీసులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.