News December 14, 2025
ఆదివారం ఏం కొనాలి? ఏం కొనకూడదు?

ఆదివారం ఇంటి నిర్మాణ వస్తువులు, గార్డెనింగ్ సామాగ్రి, ఇనుము, ఫర్నిచర్, హార్డ్‌వేర్, వాహన వస్తువులను కొనుగోలు చేయకూడదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థిక నష్టానికి, పేదరికానికి దారితీస్తుందని చెబుతున్నారు. అయితే కంటికి సంబంధించిన వస్తువులు, గోధుమలు, రాగి, ఎరుపు రంగు వస్తువులు కొనడం మాత్రం శుభప్రదమని అంటున్నారు. ఇది ఆర్థిక ఎదుగుదలకు, సూర్యుడి అనుగ్రహానికి దోహదపడుతుందని వివరిస్తున్నారు.
Similar News
News December 26, 2025
ATS విధానం అమలులోకి తేవాలి: అమిత్ షా

ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్‌లో 40KGల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 3టన్నుల పేలుడు పదార్థాలను డిటోనేట్ కాకముందే స్వాధీనం చేసుకున్నామని యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్-2025లో తెలిపారు. పోలీసులకు అవసరమైన కామన్ ATS విధానాన్ని త్వరలో అమలులోకి తేవాలని డీజీపీలను కోరారు. అందరూ తెలుసుకోవాలి అనే విధానంతో కాకుండా అందరికీ తెలియజేయాలి అనే ప్రిన్సిపల్‌తో ముందుకు సాగాలన్నారు.
News December 26, 2025
మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

ఈ ఏడాది గూగుల్ లెక్కల ప్రకారం మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తొలిస్థానం తమన్నా సొంతం చేసుకున్నారు. మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో బజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో రష్మిక, మూడో స్థానంలో సమంత, నాలుగో స్థానంలో కియారా అద్వానీ, ఐదో స్థానంలో శ్రీలీల నిలిచారు. మరి మీరు ఎవరి కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.
News December 26, 2025
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.


