News April 20, 2024

KMM: మానవత్వం చాటుకున్న CRPF ఎస్సై

image

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్ర గాయాలైన ఘటన పురుషోత్తపట్నం వద్ద చోటుచేసుకుంది. గమనించిన CRPF ఎస్సై యాకూబ్ పాషా అతనికి ప్రథమ చికిత్సను అందించి CRPF బెటాలియన్‌కు చెందిన అంబులెన్సులో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Similar News

News March 8, 2026

ఖమ్మం: సుపారీ గ్యాంగ్ సంచారం కలకలం..!

image

బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్)లో సుపారీ గ్యాంగ్ సంచారం వార్తలు కలకలం రేపాయి. గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు రెండు గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు. నిందితుడు బిహార్‌కు చెందినవాడిగా గుర్తించగా, తమతో పాటు మరో ఐదుగురు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తెలిపాడు. ఈ ఘటనతో భయాందోళనలో ఉన్న గ్రామస్థులు, వెంటనే పోలీసులు స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 8, 2026

ఖమ్మం: భారీగా యూరియా రాక

image

చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శనివారం 2,670.84 మెట్రిక్ టన్నుల ఇఫ్కో యూరియా చేరుకుంది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,070.84 టన్నులు, భద్రాద్రికి 500, మహబూబాబాద్‌కు 900, ఖమ్మం సీఆర్పీకి 200 టన్నుల యూరియా కేటాయించినట్లు టెక్నికల్ ఏవో పవన్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News March 8, 2026

వెలుగుమట్ల భూ వివాదంలో 19 కేసులు నమోదు: డీసీపీ

image

ఖమ్మం వెలుగుమట్ల భూ వివాదంలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైనట్లు అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్ రావు తెలిపారు. UCCRL (ML) OPDR భూదాన్ కమిటీ సభ్యుల ముసుగులో పేద బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి వారిని మోసం చేశారని అన్నారు. దర్యాప్తులో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9మందిని అరెస్టు చేశామన్నారు.