News December 14, 2025
నేడు జనగామ జిల్లాలో 79 గ్రామ పంచాయతీలకు పోలింగ్

జనగామ జిల్లా పరిధిలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 79 గ్రామ పంచాయతీలు, 710 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. జిల్లాలో 1,10,120 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జనగామ, నర్మేట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Similar News
News January 8, 2026
ఈనెల 22 నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలు

పాలకవీడు మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం జాన్ పహాడ్ దర్గాలో ఈనెల 22 నుంచి 24 వరకు ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు రోజుల పాటు దర్గా పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో సంతరించుకోనున్నాయి.
News January 8, 2026
HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

సిటీ నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక టికెట్ ధరలు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్ రేట్స్ ఉంటాయి. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.
News January 8, 2026
హార్దిక్ విధ్వంసం.. 31 బంతుల్లోనే

విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ పాండ్య(బరోడా) సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. ఇవాళ చండీగఢ్‌పై 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆయన మొత్తంగా 31 బాల్స్‌లో 75 రన్స్(9 సిక్సర్లు, 2 ఫోర్లు) బాదారు. ప్రియాంశ్(113), విష్ణు(54), జితేశ్(73) రాణించడంతో బరోడా 391 రన్స్ చేసింది. కాగా విదర్భపై తొలి మ్యాచ్‌లోనూ హార్దిక్ 92 బంతుల్లో 133 రన్స్(11 సిక్సర్లు, 8 ఫోర్లు) చేసిన విషయం తెలిసిందే.


