News April 20, 2024
హైదరాబాద్‌లోని ఐకియాకు జరిమానా
దుకాణాలు తాము అమ్మిన వస్తువుల ప్యాకింగ్‌కు లేదా క్యారీ బ్యాగ్ ఛార్జీలను అదనంగా వసూలు చేయకూడదు. కానీ HYDలోని ఐకియా క్యారీ బ్యాగ్‌కు ఓ కస్టమర్ నుంచి రూ.20 వసూలు చేసింది. అతడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఐకియాకు రూ.1000 ఫైన్ పడింది. ఆ మొత్తాన్ని కస్టమర్‌కు 45 రోజుల్లోపు చెల్లించకపోతే రూ.5వేలు ప్లస్ ఏడాదికి 24% వడ్డీ లెక్కన ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Similar News
News November 19, 2024
పరుగుల దాహంతో కోహ్లీ.. సైలెంట్‌గా ఉంచాలి: క్లార్క్
AUS గడ్డపై కోహ్లీ విజయవంతమైన ప్లేయర్ అని ఆ టీమ్ మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ చెప్పారు. 13 టెస్ట్ మ్యాచ్‌లలో 6 సెంచరీలు చేశారని గుర్తుచేశారు. ‘అతను పరుగుల దాహంతో ఉన్నారు. ఈసారి BGTలో మెరుగ్గా రాణిస్తారని భావిస్తున్నా. ఒక ఆస్ట్రేలియన్‌గా కోహ్లీని సైలెంట్(త్వరగా ఔట్ చేయడం)గా ఉంచాలని కోరుకుంటా. అతను తొలి గేమ్‌లో రన్స్ సాధిస్తే సిరీస్ అంతా ప్రభావం చూపుతారు. విరాట్‌కు పోరాటం ఇష్టం’ అని పేర్కొన్నారు.
News November 19, 2024
కొత్త రాజధాని అంశంపై నెట్టింట చర్చ!
గాలి నాణ్యత అత్యంత తీవ్ర స్థాయికి చేరిన ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. దీంతో కొత్త రాజధాని ఏదైతే బాగుంటుందా? అనే చర్చ మొదలైంది. AQI 100లోపు ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను చాలా మంది కోరుకుంటున్నారు. అయితే, అనువైన వాతావరణం, భద్రత, ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా HYD బాగుంటుందని మరికొందరు అంటున్నారు. మీరేమంటారు?
News November 19, 2024
అధికారులు తప్పుచేస్తే చర్యలు: ‘హైడ్రా’ రంగనాథ్
TG: అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై విచారణ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. వారు తప్పుచేసి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన అమీన్‌పూర్ మున్సిపాలిటీలో పర్యటించారు. అమీన్‌పూర్ చెరువు పరిధిలో ఆక్రమణల గురించి పలువురు రంగనాథ్‌కు వివరించారు. దీనిపై స్పెషల్ టెక్నికల్ టీమ్‌తో సర్వే చేయిస్తామని, ప్రభుత్వంతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.